యెదలోన ఆశలే - కౌండిన్య

యెదలోన ఆశలే.... కన్నీటి బాసలై .....
మదిలోన ఊసులే .... ఎన్నెన్నో తెలిపెనే....
ఇలా నేనేంటో .... నాలో పొంగే కథ ఏంటో .....!
ఇలా నేనేంటో .... నాలో పొంగే కథ ఏంటో .....!

ప్రతి క్షణము గడిచేనే నాకు ఓ యుగములా ....
నువ్వు కనబడని ఈ లోకంలో నే బ్రతికేదేలా....
నీ వెంటే నేనుంటాలే ఒక్కో అడుగున....
నిన్ను చూసే కళ్ళే నాకు ప్రాణం పోయవా ....
తన చూపులే ఇక నా ఊపిరీ .... తన నవ్వులే ఇక నా కౌగిలి....
తను దేవతే కదా నా గుండెలో.... మరి తనకోసమే కదా ఈ జీవితం!
ఎలా తెలిపేది.... నాలో ఈ భావనే....!
ఎలా పలికేది తనతో పాటు ఉంటూనే నను మరచి నా ప్రాణమే....
పిలిచినా చూస్తుండగా .... మార్చావిలా....!
యెదలోన ఆశలే.... కన్నీటి బాసలై .....
మదిలోన ఊసులే .... ఎన్నెన్నో తెలిపెనే....
ఇలా నేనేంటో .... నాలో పొంగే కథ ఏంటో .....!

0 Comments