ఒంటరినే - కౌండిన్య

ఒంటరినే ఐనానే తను లేకా ....
తన చూపులే నన్ను కోసెనే ప్రతి క్షణమునా ....!
ఒంటరినే ఐనానే తను లేకా ....
తన చూపులే నన్ను కోసెనే ప్రతి క్షణమునా ....!
బాధే నాకు తోడుగా ..... 
కన్నీరే కౌగిలిగా .... 
ఎగిసే గుండె కోతనే .... 
ఆపే శక్తి లేక .... 
తన తోడే నాకు లేక .... 
విలపించనీ హృదయాన్నీ.... ఈ.....  ఇలా... !
ఇక నేనే ఒంటరీ ..... ఆగిపోనీ ఊపిరీ ..... 
తను లేనీ జీవితాన్నే ఆపనీ !
ఇక నేనే ఒంటరీ ..... ఆగిపోనీ ఊపిరీ ..... 
తను లేనీ జీవితాన్నే ఆపనీ !
 ప్రతీ క్షణం తనకోసమే వేచి ఉన్నా ..... 
నా మనసునే యెడబాటు తొలిచి వేసెనే .... 
ఈ ఊపిరే తన సొంతమై నేను ఉన్నా .... 
తను మాత్రం నన్ను విడిచీ ఒదిలి వెళ్ళేనే.... 
నాలో నువ్వే నువ్వే ఓ ప్రపంచమై ఉన్నా .... 
ఇవ్వాళ్లిలా ఎదురై నన్నే దహించి వేసావే .... 
అటూ...  ఇటూ....  ఎటు చూసినా .... 
ప్రతీ చోట నువ్వే....!
ప్రపంచమంతా నువ్వై నన్ను ఒంటరి చేసావే ...... ప్రేమా ....!
నా ప్ర్రాణం నువ్వనీ ... నా జీవం నువ్వనీ .... నా సర్వం నువ్వనీ ....  తెలపనీ ....!
ఇక నేనే ఒంటరీ ... 
ఆగిపోనీ ఊపిరీ .... తను లేనీ జీవితాన్నే ఆపనీ !  
ఒంటరినే ఐనానే తను లేకా ....
తన చూపులే నన్ను కోసెనే ప్రతి క్షణమునా ....!

0 Comments