విరిగిన మనసుని అతికించేదెలా ?
మానని గాయం ఆరేదెలా ....?
కనిపించే నా చిరునవ్వు .... కనబడని ఆ కన్నీరు ....!
బాధించే ఈ యెడబాటు .... నిన్ను దగ్గర చేసిన నీ ఓదార్పు !
నాకు నేనే ... నాతో నేనే ...!
"అందరికీ కనిపించే నేను ... నేను కాదు !
నీకు తెలిసిన నేనే ... నేను!
దూరమైన ఆ నన్ను, నేను వెతికిన ప్రతీ క్షణం ....
నువ్వు లేని నేను, నేను కాదని గుర్తుచేస్తుంది !"
నాలో జరిగే ఈ మౌన పోరాటం .....
యెడబాసిపోని నా నిశ్శబ్ధం....
తీరని మన మధ్య దూరం ..... కనపడే సంద్రం ఆకసం కలిసిన క్షణం !
కనిపించే కలయిక .... కానరాని దూరం !
దూరమై నన్నుఒదిలివెళ్ళిన ఓ నేస్తమా ....
నేనేం చేసానో నేరం .....
నువ్వు నన్ను ఒదిలే అంత పాపం !
ఒక వేళ తిరిగివచ్చే వీలే ఉంటే .... నీ పాదాలను నా కన్నీరుతో కడిగి క్షమాపణ చెప్పే నా కన్నీటి సాక్షిగా ....
నువ్వు వదిలేసిన ఈ ప్రాణం నీకై తపించి పోతుంది !
అమ్మ తర్వాత నా మనసు మెచ్చిన ఓ ప్రతిరూపమా ....
నీ కోసం నే వేచిన ప్రతీ క్షణం.... ఒక యుగంలా ఉంది !
ఎందుకో నీకు తెలియదా ?
క్షమించు.... తప్పు చేసినందుకు కాదు ....!
నువ్వు లేనప్పుడు నిన్ను తియ్యగా తిట్టుకున్నందుకు!

0 Comments